WGL: జిల్లా వ్యాప్తంగా బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముస్లిం పెద్దలతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు అప్రమత్తంగా ఉన్నారన్నారు. ఆయన ప్రజలు సహకరించాలని కోరారు.