హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్, అఫ్జగంజ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా పట్టుబడింది. ఈ ఆపరేషన్లో ఏడుగురు రవాణాదారులు, ఒక స్థానిక విక్రేతను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 16 లక్షల విలువైన 23 కేజీల గంజాయి, ఒక బైక్, 6 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.