NZB: దోస్త్- యూజీ కోర్సుల్లో ప్రత్యేక కేటగిరీలో భాగంగా ఫేజ్-2 కింద అడ్మిషన్ పొందిన విద్యార్థులకు మంగళవారం ధ్రువపత్రాల పరిశీలన తెవివి పరిపాలన భవనంలోని డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ సెక్షన్లో నిర్వహించనున్నట్లు కో-ఆర్డినేటర్ చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలని సూచించారు.