ATP: గుంతకల్లులో అన్ని వర్గాల ప్రజలు తమ సంప్రదాయాలను గౌరవించుకుంటూ బక్రీద్ పండగను ప్రశాంత వాతావరణంలో జరుపుకో వాలని డీఎస్పీ శ్రీనివాస్ సూచించారు. వన్ టౌన్ పీఎస్ ఆవరణలో అన్నిమతాల పెద్దలతో జరిగిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పార్టీలకతీతంగా సహకరించాలని చెప్పారు.