గద్వాలలో విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణను వ్యతిరేకించాలని DTF జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదయ్ కిరణ్ అన్నారు. జూన్ 5న హైదరాబాద్లోని సుందరయ్య పార్కు నుంచి ఇందిరాపార్క్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో గోడపత్రికలు విడుదల చేశారు. రాష్ట్రంలో విద్యారంగం సంక్షోభంలో ఉందని, రాష్ట్ర విద్యా విధానం దేశానికే ఆదర్శంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.