KDP: రాజుపాలెం మండలం కొర్రపాడు గ్రామంలో సోమవారం SI ప్రణయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బెల్ట్ షాపుల్లో అక్రమ మద్యం అమ్మకాలపై దాడులు నిర్వహించారు. ఒక కేసులో 49 బాటిళ్లు, మరో కేసులో 47 బాటిల్లు అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు. రెండు దాడుల్లో 96 మద్యం బాటిళ్లు సీజ్ చేశారు. పొట్టిపాడు గ్రామంలోనూ బెల్ట్ షాపులపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.