ADB: మహిళలు అన్ని రంగాల్లో రాణించి ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “మిషన్ శక్తి” మహిళా వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. మహిళల రక్షణ, భద్రత, ఆరోగ్యం, వారి ఆర్థిక స్వావలంబన సాధించడమే మిషన్ శక్తి ముఖ్య ఉద్దేశమని అన్నారు.