AP: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ విజయవాడ గాంధీనగర్లో ‘సైన్స్ సమగ్ర మహోత్సవ్-2026’ ముగింపు కార్యక్రమం జరగనుంది. AP సైన్స్ సిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహోత్సవంలో రాష్ట్రవ్యాప్తంగా 4118 స్కూల్స్ నుంచి 29435 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారిలో జిల్లాక ఒకరి చొప్పున ఎంపిక చేసిన విజేతలకు ప్రతిభ పురస్కారాలు, సర్టిఫికెట్లు అందజేయనున్నారు.