VSP: కొమ్మాది జంక్షన్ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీకాకుళం నుంచి వస్తున్న RTC నాన్ స్టాప్ బస్సు బైకు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడు విజయనగరం (D) దత్తిరాజేరు (M) ఎస్.బూర్జివలసకు చెందిన మోహన్ రావు (26)గా గుర్తించారు. ఆయన మధురవాడలోని ఓ ప్లాంట్లో వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు.