VZM: కొత్తవలస వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో సాధారణ సమావేశం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ చోక్కాకుల మల్లునాయుడు అధ్యక్షతన శనివారం నిర్వహించారు. రైతు బజార్ ఏర్పాటుపై తీవ్ర కృషి చేస్తున్నట్లు ఛైర్మన్ తెలిపారు. జూన్ ఒకటితో ముగుస్తున్న సభ్యుల పదవీ కాలాన్ని మరో ఆరునెలలు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయని సమావేశంలో చెప్పారు.