ప్రకాశం: మద్దిపాడు (మం) ఇనుమామల్లూరులో పేకాట ఆడుతున్న నలుగురిని స్థానిక పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.4,360 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు చేశామని, పేకాట ఆడటం చట్టరీత్య నేరమని పోలీసులు హెచ్చరించారు.