AP: గొడ్డలి పార్టీ అధ్యక్షుడి పూర్వీకుల చరిత్ర అందరికీ తెలుసు అని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఆ నాయకుడి దారుణాలు రాయలసీమలో ఏ గడపని అడిగినా చెబుతారని.. రాజారెడ్డి రాజ్యాంగం గురించి కథలు కథలుగా చెప్పేవారు ఉన్నారని పేర్కొన్నారు. SC, STలను చోరీ కేసులతో వేధించిన చరిత్ర జగన్ కుటుంబానిదని ఆరోపించారు. లండన్ వెళ్లి చికిత్స తీసుకున్నా ఇంకా జగన్ జబ్బు తగ్గలేదని విమర్శించారు.