నెల్లూరు జిల్లా కావలికి చెందిన న్యాయవాది దామిశెట్టి సుభాషిణి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో డాక్టరేట్ సాధించారు. జీఎస్టీపై ఆమె చేసిన పరిశోధనకు ఈ గౌరవం దక్కింది. నెల్లూరు బార్ అసోసియేషన్‌లో పీహెచీ పొందిన తొలి మహిళా లాయర్‌గా ఆమె రికార్డు సృష్టించారు. ఈ విజయాన్ని తన తండ్రి దివంగత శ్రీనివాస నాయుడుకు అంకితం చేశారు.