అన్నమయ్య: ఉపాధ్యాయురాలు జ్యోతిలక్ష్మిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించినట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. 2024 నుంచి విధులకు గైర్హాజరవడంతో పాటు అనుమతి లేకుండా అమెరికాకు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో షోకాజ్ నోటీసు జారీ చేసి, డివైఈవో స్థాయి విచారణ అనంతరం ఆమెపై తొలగింపు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.ల