AP: పెట్రోల్, డీజిల్ ధరలపై నియంత్రణ లేదని వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వస్తే ఇంధన ధరలు తగ్గిస్తామన్నారని.. అధికారంలోకి వచ్చాకా ధరలు పెంచుతున్నారని తెలిపారు. ధరల పెంపుపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రశ్నిస్తే చాలు మంత్రులు విరుచుకుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.