NDL: డోన్ YCP కార్యాలయంలో శనివారం మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్యాపిలి టౌన్, మండల BLAలతో సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్ లిస్టుల్లో అవకతవకలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో మాజీ మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ రాములు, జిల్లా బూత్ కమిటీ కన్వీనర్ ఎద్దుల రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు.