కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్లో ఎంపీ వల్లభనేని బాలశౌరి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయం పర్యవేక్షణ కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అభివృద్ధి పనులు, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం తదితర అంశాలపై ఎంపీ చర్చించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ బాలాజీ, ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.