ATP: బక్రీద్ పండుగను పురస్కరించుకుని పశువుల సంత కోసం మార్కెట్ యార్డ్లో కవర్ షెడ్ గేట్లను తెరిచినట్లు అనంతపురం మార్కెట్ యార్డ్ ఛైర్పర్సన్ బల్లా పల్లవి తెలిపారు. దీనివల్ల రైతులు, వ్యాపారుల ఇబ్బందులు తొలగుతాయన్నారు. అలాగే ట్రాఫిక్ సమస్యల నివారణకు మార్కెట్ యార్డ్ పరిసరాల్లో ప్రతి వారం బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను కోరారు.