NDL: ఆత్మకూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ టి.వెంకట కృష్ణయ్య శనివారం గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఇంఫాల్ బిర్ టి కేంద్రజిత్ యూనివర్సిటీ నుంచి అవార్డు తీసుకున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపల్ పద్మావతీ బాయి వెల్లడించారు. కాగా, ‘ఈశాన్య భారతంలో వలస సమూహాలు- చరిత్రాత్మక కారణాలు’ అనే అంశంపై వెంకట కృష్ణయ్య పరిశోధన చేశారు.