KNR: కరీంనగర్ జిల్లాలో కమర్షియల్ ట్యాక్స్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వందల కోట్ల రూపాయల జీఎస్టీ ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోంది. నిత్యం బోగస్ సంస్థల పేరిట నకిలీ వేబిల్లులతో వందలాది లారీల్లో గ్రానైట్ ప్లేట్లు ‘జీరో’ ధందాతో దర్జాగా హైదరాబాద్కు తరలిపోతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని పలువురు ఆరోపిస్తున్నారు.