PDPL: ప్రసిద్ధ శైవక్షేత్రం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో భక్తులను విశేషంగా ఆకర్షించే అంశాల్లో యమకోణం అత్యంత ప్రధానమైనది. ఇది ఇరుకైన ఒక రాతి ప్రవేశ మార్గం. ఈ యమకోణం గుండా ఒక్కసారి దూరి బయటకు వస్తే యమ బాధలు తొలగిపోతాయని, అకాల మరణ భయం ఉండదని భక్తుల ప్రగాఢ విశ్వాసం.