SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీలో కమిషనర్ టీ.రవి ఆధ్వర్యంలో శనివారం ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన రహదారుల ఇరువైపులా, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిశుభ్రత చర్యలు చేపట్టారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కమిషనర్ సూచించారు.