NLG: అడవిదేవులపల్లిలోని మహిషాసురమర్ధిని అమ్మవారి జాతర మహోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. కులమతాలకతీతంగా ఊరి ప్రజలంతా కలిసి జరుపుకునే ఈ ఉత్సవాలు మే 24న అంకురార్పణ, బియ్యం కోల కార్యక్రమాలతో ప్రారంభమవుతాయి. జూన్ 1వ తేదీ సోమవారం భక్తులకు దీవెన బండారి అందజేయడంతో ఈ వేడుకలు ముగుస్తాయి.