PLD: సత్తెనపల్లి కొత్తపేటలో 100 మంది పోలీసులతో కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 81 బైకులు, ఒక కారు, ఆటోను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ.. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలపై 112కు సమాచారం ఇవ్వాలని కోరారు.