ఏలూరు ఆర్ఆర్ పేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద శనివారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం… వెంకట్ రెడీమేట్ షాపు నుంచి భారీగా పొగలు రావడంతో దుకాణంలో మంటలు చెలరేగి ఉంటాయనట్లు సమాచారం. మూసి ఉన్న షాపులో మంటలు చెలరేగడంతో స్థానికులు వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు.