సత్యసాయి: లేపాక్షి మండలం తిలక్ నగర్‌కు చెందిన మెగా హర్ష బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించి రెండోసారి పేకాట ఆడుతూ దొరకడంతో పోలీసులు జైలుకు తరలించారు. గతంలో కేసు నమోదు కావడంతో ఏడాదిపాటు బైండోవర్ చేసి, రూ.5 లక్షల బాండ్ తీసుకున్నారు. అయినా మార్పు రాకుండా మళ్లీ పేకాట ఆడుతూ పట్టుబడడంతో తహసీల్దార్ ఆదేశాల మేరకు నిందితుడిని రిమాండ్‌కు పంపినట్లు సీఐ జనార్ధన్ తెలిపారు.