TPT: బెంగుళూరుకు చెందిన తరుణ్ గౌడ అనే భక్తుడు TTD శ్రీవేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ. 10,10,001 విరాళంగా అందించారు. తిరుమలలో అదనపు ఈవో వెంకయ్య చౌదరిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి విరాళం డీడీని అందజేశారు. అనంతరం దాత, ఆయన కుటుంబ సభ్యులను అదనపు ఈవో అభినందించారు.