AP: పురపాలికల్లో ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ల ఏర్పాటుపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఘన వ్యర్థాల ప్రాసెస్కు ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్లు నెలకొల్పుతున్నామని తెలిపారు. మొత్తం 107 పురపాలికల్లో ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ప్లాంట్ల పనులు ఏ దశలో ఉన్నాయో అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్లాంట్లకు మౌలిక వసతులు కల్పించాలని కమిషనర్లకు సూచించారు.