MNCL: జైపూర్ మండలం ముదిగుంట, ఇందారంలోని రైస్ మిల్లులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ధాన్యం ప్రక్రియను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల నుండి తరలించిన ధాన్యాన్ని వేగంగా దిగుమతి చేసుకోవాలని, లారీలు వేచి ఉండకుండా తిరిగి పంపించాలని సూచించారు. ఈ క్రమంలో అవసరమైన హమాలీల సంఖ్య పెంపొందించుకోవాలని తెలిపారు.