PLD: పార్టీ బలోపేతమే లక్ష్యంగా వైసీపీ బూత్ లెవెల్ ఏజెంట్లు, ఇన్ఛార్జ్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మాచర్ల పట్టణంలోని పీఎల్ఆర్ కళ్యాణ మండపంలో పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాబోయే ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియపై అవగాహన కల్పించారు.