KMR: మద్నూర్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు కళా బృందం కార్యక్రమంలో సైబర్ నేరాలతో మోసపోతే టోల్ ఫ్రీ నంబర్ 1930 కాల్ చేయాలని, ఓటీపీలు ఎవరికీ చెప్పకూడదని సూచించారు. డ్రైవింగ్ సమయంలో తప్పకుండా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని పేర్కొన్నారు.