KMR: భిక్కనూర్ మండలం పెద్ద మల్లారెడ్డి శివారులోని కంకర మిషన్ వద్ద శుక్రవారం ట్రాక్టర్ ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. మృతుడు మెదక్ జిల్లా నందిగామకు చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని స్థానికులు నందిగామ ప్రజలకు సమాచారం అందించారు. మృతుని వివరాలతో పాటు ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.