కోనసీమ: భారతదేశ జనాభా గణన-2027 కార్యక్రమంలో ప్రజలంతా చురుకుగా పాల్గొని సరైన వివరాలు అందించాలని రావులపాలెం ఎంపీడీవో సుబ్రహ్మణ్యం కోరారు. జనాభా గణన వివరాలు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు, ఆసుపత్రులు, పాఠశాలలు, రహదారుల వంటి మౌలిక వసతుల ప్రణాళికకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఒకవేళ గణన అధికారులు ఇంటికి రాకపోయినా, సందేహాలున్నా టోల్ ఫ్రీ నంబర్ 1855ను సంప్రదించాలన్నారు.