NGKL: వంగూరు మండలంలోని ఉల్పర గ్రామ వాగుపై బ్రిడ్జి నిర్మాణం, కల్వకుర్తి వరకు డబుల్ రోడ్డు వేయాలని బీజేపీ నేతలు మహాపాదయాత్ర చేపట్టారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. బ్రిడ్జి నిర్మాణం లేకపోవడంతో వాహనదారులు, రైతులు, స్థానికులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం స్పందించి డబుల్ రోడ్డు వేయాలని కోరారు.