KMM: కామేపల్లి మండలం కొత్త లింగాలలో శుక్రవారం మాజీ మంత్రి రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి జయంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుజ్జర్లపూడి రాంబాబు పార్టీ నేతలతో కలిసి మాజీ మంత్రి విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి రాంరెడ్డి కృషి చేశారన్నారు.