AP: రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతుంది. ఐదు రోజులపాటు ఎండల తీవ్రత ఉంటుందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. 41-43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. పలు జిల్లాలకు రెడ్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తిరుపతిలో గరిష్ఠంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.