AP: మహాయజ్ఞంలా విత్తనబంతుల తయారీ, పంపిణీ జరుగుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. 2.5 కోట్ల విత్తనబంతుల పంపిణీకి అటవీశాఖ సన్నాహాలు చేస్తుందని చెప్పారు. జీవవైవిధ్యం, పర్యావరణ స్థిరత్వమే లక్ష్యంగా హరిత సమరం జరుగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం పెంచడమే లక్ష్యమని వెల్లడించారు. జూన్లో విత్తన బంతుల తయారీ కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.