MDK: పురాతన కట్టడాలను పరిరక్షించడం మనందరి బాధ్యత అని తూప్రాన్ తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీవో సతీష్ పేర్కొన్నారు. తూప్రాన్ మండలం యావాపూర్ గ్రామంలోని పురాతన బురుజు, శివాలయం వద్ద ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం’లో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యాంజాల స్వామి, ఉపసర్పంచ్ హనుమంతు, పంచాయతీ కార్యదర్శి అరుణ పాల్గొన్నారు.