హైదరాబాద్‌లోని గృహ సముదాయాలు, వ్యాపార సంస్థలలో నేపాల్‌కు చెందిన అనేక మంది కార్మికులుగా పనిచేస్తున్నారు. ఒక్క మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోనే 800 మందికి పైగా నేపాలీల వివరాలు నమోదయ్యాయి. నగరం మొత్తం పరిశీలిస్తే వారి సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా వారి వివరాల నమోదు ప్రక్రియను పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.