కోనసీమ: దళితులపై దాడుల అంశంలో కూటమి ప్రభుత్వం, టీడీపీ ఎమ్మెల్యే ఆనందరావు చేపడుతున్న కార్యక్రమాలు హాస్యాస్పదంగా ఉన్నాయని వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ విమర్శించారు. అమలాపురంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో జరిగిన ఘటనలనే ప్రస్తావిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.