KNR: శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో పొలాల్లో నిల్వ చేసిన వరికొయ్యలకు అకస్మాత్తుగా మంటలు అంటుకుని భారీగా దగ్ధమయ్యాయి. ఈదురు గాలులతో మంటలు సమీప ఇళ్లవైపు వ్యాపించడంతో గ్రామస్థులు భయపడిపోయారు. విద్యుత్ తీగలు తగలడంతోనే అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానికులు తెలిపారు. ఫైర్ సిబ్బంది ఆలస్యంగా రావడంతో గ్రామపంచాయతీ ట్యాంకర్‌తో ప్రజలే మంటలను అదుపు చేశారు.