W.G: 15 ఏళ్ల క్రితం రొయ్య ధర ఎంత ఉందో ఇపుడు అంతే ఉందని, అయితే ఫీడ్, సీడ్, కూలీల ఖర్చులు పెరిగిపోయాయని ఆక్వా రైతులు శుక్రవారం ఆరోపించారు. పాలకొల్లు వై. జంక్షన్ వద్ద ఆక్వా ఫీడ్, సీడ్ ఫ్యాక్టరీల సిండికేట్‌కు వ్యతిరేకంగా జై భారత్ క్షీర రామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రొయ్య రైతు నష్టాల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు.