AP: రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పాటుపడుతోందని మంత్రి సవిత తెలిపారు. పరిశ్రమల కోసం లోకేష్ అహర్నిశలు కష్టపడుతున్నారని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. ఇందుకోసం మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో తామంతా పనిచేస్తున్నామని వ్యాఖ్యానించారు. యువతలో నైపుణ్యాలు వృద్ధి చెందేందుకు త్వరలోనే కొత్త కార్యక్రమాలు చేపడతామని అన్నారు.