VSP: జీవీఎంసీ 48వ వార్డు ఇందిరానగర్-1 కొండవాలు ప్రాంతంలో శుక్రవారం మాజీ కార్పొరేటర్ గంకల కవిత అప్పారావు యాదవ్ పర్యటించారు. మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను పరిశీలించి వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. గుడ్ మార్నింగ్ గంకల కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల మేరకు జీవీఎంసీ కౌన్సిల్లో నిధులు మంజూరు చేయించి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.