తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి బ్యాంకులు తమ వంతు సాయం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. గోడౌన్స్, కోల్డ్ స్టోరేజీల నిర్మాణానికి రైతులకు బ్యాంకులు ఉదారంగా లోన్స్ ఇవ్వాలన్నారు. సాగులో యాంత్రీకరణ ప్రోత్సాహానికి ప్రభుత్వం రూ.147.91CRను కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉద్యానవనాలు, ఆయిల్‌పామ్ సాగుకున్న అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.