NDL: డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి మిషన్ ద్రోణాచార్య కార్యక్రమంలో భాగంగా ఈ రోజు డోన్ పట్టణంలోని 6వ వార్డును సందర్శించారు. వార్డులోని రోడ్లు, కాల్వలు, డ్రైనేజీ, పారిశుద్ధ్య, విద్యుత్ స్తంభాలు, ఇతర మౌలిక వసతుల సమస్యలను స్థానిక ప్రజలతో మాట్లాడి తెలుసుకున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించేలా సిబ్బందితో అక్కడికక్కడే పనులు చేట్టించారు.