NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో ఇవాళ మిద్దె సుధాకర్ కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకున్నారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయానికి మిద్దె సుధాకర్ రెండు స్టీల్ హుండీలను ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, తదితరులు పాల్గొన్నారు.