AP: విశాఖ పోర్టులో అగ్నిప్రమాదం జరిగింది. పోర్టు అథారిటీ ట్రక్ పార్కింగ్ టెర్మినల్‌లో మంటలు చెలరేగాయి. పార్కింగ్‌లో ఉన్న లారీ క్యాబిన్లో సిలిండర్ పేలింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.