VZM: ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి శుక్రవారం కుటుంబ సమేతంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే దంపతులకు, కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి మూలవిరాట్టును దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.