నాగర్కర్నూల్ వ్యవసాయ మార్కెట్కు 87 మంది రైతులు పంటలను విక్రయానికి తీసుకువచ్చారు. అత్యధికంగా 461.16 క్వింటాల మక్కలు రాగా గరిష్ఠ ధర రూ.1,920, కనిష్ఠ ధర రూ.1,616 నమోదైంది. వేరుశనగ 11.40 క్వింటాలు రాగా గరిష్ఠ ధర రూ.7,919 పలికింది. సన్న, లావు వడ్లు, మినుములు, ఆముదాలు కూడా మార్కెట్కు చేరాయి.